లాక్ డౌన్ సమయంలో ప్రజలు ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా మంది వైద్యానికి నోచుకోవడం లేదు. అలాగే రైతులకు సంబంధించిన ఔషధాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎరువులు, పురుగుల మందులు వంటివి రైతులకు దొరకడం చాలా కష్టంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి కోసం అనేక చర్యలను చేపడుతుంది. పలు రాష్ట్రాల్లో ఎరువులను రసాయనాలను అందించడానికి గానూ చాలా వరకు కృషి చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ప్రజలకు అవసరం అయిన మందులను కూడా అందించడానికి గానూ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ఇకపై వాట్సప్,
ఈ-మెయిల్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి… వైద్యులు రాసిన చీటీలను అప్‌లోడ్ చేసి వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా పంపితే నేరుగా ఇంటికి ఔషధాలు అందజేస్తాయని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అటు ప్రజలకు రైతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.