ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4 వ తేదీ నుంచి ఏపీలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్ గా మార్పు చెందుతున్నట్లు పేర్కొంది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది సర్కార్. ఇక 26 జిల్లాలకు కలెక్టర్లను నియామకం చేసిందిసర్కార్. వారి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్
అనంతపురం జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి
విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావు
విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారి
మన్యం జిల్లా కలెక్టర్ గా నిశాంత్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్
అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా రవి సుభాష్
కాకినాడ జిల్లా కలెక్టర్ గా కృత్తికా శుక్ల
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత
కోనసీమ జిల్లా కలెక్టర్గా హిమాన్షు శుక్లా
పశ్చిమగోదావరి కలెక్టర్గా పి. ప్రశాంతి
ఏలూరు జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్
కృష్ణా జిల్లా కలెక్టర్ గా రంజిత్ భాష
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఢిల్లీ రావు
కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజు
గుంటూరు జిల్లా కలెక్టర్ గా వేణుగోపాల్రెడ్డి
పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివ శంకర్
బాపట్ల జిల్లా కలెక్టర్గా విజయ
ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
నెల్లూరు జిల్లా కలెక్టర్గా చక్రధర బాబు
బాలాజీ జిల్లా కలెక్టర్గా వెంకటరమణారెడ్డి
చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాయణ
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా గిరీష
కర్నూలు జిల్లా కలెక్టర్గా కోటేశ్వరరావు