మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ రహదారిపై 48 గంటల్లో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.హైవే మధ్యలో నుంచి రోడ్ క్రాస్ చేసే క్రమంలో ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. నిన్న మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా..ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తాజాగా అదే ప్రదేశంలో బైకర్ రోడ్ క్రాస్ చేస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాల్లోకి ఎగిరి డివైడర్ మధ్యలోంచి పక్కనున్న రోడ్డుపై పడిపోగా.. కారు డివైడర్ మధ్యంలోని మట్టిలో కూరుకుపోయింది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. అక్కడ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
48 గంటల్లో ఒకే చోట రెండు ప్రమాదాలు
మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు
బైకర్‌కు తీవ్ర గాయాలు
అదే చోట తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళనలో ప్రజలు https://t.co/ed6oW6ZjaG pic.twitter.com/51IrURRE1P
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025