త్వరలో దసరా నుంచి ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌…

-

పక్కా తెలంగాణ రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలో నాని కాంపౌండ్‌ నుంచి వచ్చిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ దసరా. మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. తెలంగాణ రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలో జరిగే కథాంశంతో సాగే దసరా.. క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధరణిగా నాని, వెన్నెల పాత్రలో కీర్తిసురేశ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

దసరా సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మూవీ లవర్స్‌ కు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించాడు. దసరా సినిమా నుంచి ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ (ఓఎస్‌టీ)ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. అయితే ఏ రోజు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు.‘దసరా సినిమాపై మీ బేషరతు ప్రేమకు ధన్యవాదాలు. దసరా నుంచి ఒరిజినల్ స్కోర్ సిద్ధంగా ఉంది. అతి త్వరలో విడుదల అవుతుంది. మీరు సెలబ్రేట్‌ చేసుకున్న, ప్రశంసించిన వాటిలో ఒక గంటపాటు సాగే స్పెషల్‌ థీమ్స్‌, సాంగ్స్‌ తో ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ రాబోతుంది. వీటి కోసం కష్టపడి పనిచేసిన నా టీంకు ధన్యవాదాలు.. ‘అని ట్వీట్ చేశాడు సంతోష్‌ నారాయణన్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version