కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన పేటెంట్లను అమలు చేయబోమని, కరోనావైరస్ వ్యాప్తి ముగిసిన తర్వాత దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సంస్థలపై ఎటువంటి వ్యాజ్యాన్ని వేసేది లేదు అని మోడరనా ఇంక్ తెలిపింది. మోడరనా యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇతర ఔషధ తయారి దార్లు… వ్యాక్సిన్ ని తయారు చేయడానికి అనుమతించే నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
మహమ్మారి తర్వాత టీకా వెనుక ఉన్న టెక్నాలజీకి లైసెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. మోడెర్నా తన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి అలాగే ఉత్పత్తి చేయడానికి 1 బిలియన్ డాలర్లకు పైగా ప్రభుత్వ నిధులను పొందింది. అమెరికన్లకు సరఫరా చేయడానికి మరో 1.5 బిలియన్ డాలర్లు అందుకుంది. మోడరనా ప్రెసిడెంట్ స్టీఫెన్ హోగ్ ఒక ఇంటర్వ్యూలో ఈ మేరకు ప్రకటన చేసారని వాల్ స్ట్రీట్ పేర్కొంది.