చైనా నుంచి హైదరాబాద్‌కు ఆక్సిజన్ కాన్సంటేట‌ర్లు

-

చైనా నుంచి తెలంగాణ‌ రాష్ట్రానికి ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. ఇందులో గ్రీన్ కో సంస్థ భాగంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సంటేట‌ర్లను అందజేసింది. ఈ ఆక్సిజన్ కాన్సంటేట‌ర్లు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఈ ఆక్సిజన్ కాన్సంటేట‌ర్లను మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచి, ఆక్సిజన్‌ కాన్సంటేట‌ర్లను అందజేసిన గ్రీన్‌కో సంస్థకు మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా నియంత్రణకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు సైతం చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌, ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని… రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version