గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చామని తెలంగాణా ప్రభుత్వం చెబుతోంది. అయితే టిమ్స్ హాస్పిటల్ లో ఆక్సిజన్ నిలిచి పోవడంతో ఆక్సిజన్ లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అందులో ఉన్నవారిని గుట్టుచప్పుడు కాకుండా 30 అంబులెన్స్ లలో గాంధీ హాస్పిటల్ కి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోని. ఇక ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఈ నెల మొదట్లోనే అందుబాటులోకి వచ్చింది.
ఈ హాస్పిటల్ లో 1,350 పడకలు, ఐసీయూ సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని స్టేడియం పక్కనే 13 అంతస్తులతో కూడిన భవనంలో 1500 పడకలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(టిమ్స్)గా కేసీఆర్ ఏప్రిల్ నెలలోనే ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్న ఆస్పత్రికి అదనంగా మరో 9.16 ఎకరాల స్థలాన్ని కేటాయించి భారీ ఆస్పత్రిగా తీర్చిదిద్ది ప్రజలకు వైద్య సేవలందిస్తామని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.