తెలంగాణ రైతులకు షాక్… యాసంగిలో వరిని సాగు చేయవద్దు- మంత్రి నిరంజన్ రెడ్డి.

-

తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చే వార్తను చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. యాసంగి కాలంలో వరి పంటను సాగు చేయవద్దని రైతులకు ఖరాఖండీగా, స్పష్టంగా తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగి పంట సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమని తెలిపారు. కాగా వానాకాలంలో పండించిన వరిని మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్ సీ ఐ బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయమని చెప్పిందని.. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగి వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ద్రుష్టి పెట్టాలని కోరారు. ఎవరైతే మిల్లర్లతో, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు ఉంటే వారు నిరభ్యంతరంగా వరిని సాగు చేసుకోవచ్చు అన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, 62 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారని తెలిపారు. వానాకాలం పంట కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. రైతులకు వానాకాలం పంట కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు కలిగించమని వెల్లడించారు. గతంలో పత్తిని సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిందని.. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది పత్తికి రికార్డ్ స్థాయిలో ధర వస్తుందని తెలిపారు. కొన్ని రాజకీయపార్టీలు రైతులను ముందు పెట్టుకుని పబ్బం గడిపే ఆలోచనలో ఉన్నాయని .. రైతులు ఆలోచన చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version