తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని తెలిపింది కేంద్రం. ఈమేరకు లోక్ సభలో లిఖితపూర్వక హామీ ఇచ్చారు పియూష్ గోయల్. ధాన్యం సేకరణ అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని… పరిస్థితుల ఆధారంగా సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది కేంద్రం. కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్ ధరల మేరకే సేకరణ జరుగుతుందని తెలిపింది. రాస్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్సీఐ నిర్ధిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తామని స్పష్టం చేసింది. గోధుమ, వరి ధాన్యాలు నిర్థిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తామని కేంద్రం తెలిపింది. ఎఫ్సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యం సేకరణ జరుగుతుందని అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి ధాన్యం పంపిణీ జరుగుతుందని అన్నారు.