బండి సంజయ్ ట్రాప్ లో పడ్డది నువ్వు… ఈటలపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్

-

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ ట్రాప్ లో పడ్డది నువ్వురా పిచ్చోడా ఈటల రాజేందర్ అని మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నువ్వే బండి సంజయ్ ట్రాప్ లో పడి ఆగమాగం అవుతున్నావు అని చురకలు అంటించారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

padi kaushik reddy slams etela rajender
padi kaushik reddy slams etela rajender

అభివృద్ధి కార్యక్రమాల కోసం బండి సంజయ్ కాదు ఎవరొచ్చినా నేను కలుస్తా అన్నారు. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని పేర్కొన్నారు. నీ కడుపులో విషం పెట్టుకొని బయటకి ఏదో మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news