వేట షురూ.. బలూచిస్తాన్‌లో పాక్ సైనికులే లక్ష్యంగా బాంబు దాడి..

-

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ చిల్లర దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను కాల్చి చంపింది. భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ దాడికి ప్రతీకారం ఉంటుందని ప్రకటించింది. ఇదే సమయంలో, బలూచిస్తాన్ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం శక్తివంతంగా ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమంలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ సైనికులు , అధికారులను లక్ష్యంగా ఉగ్రదాడులు చేస్తోంది.

శుక్రవారం బలూచిస్తాన్‌లో ఒక బాంబు పేలుడు జరగడంతో ఏడుగురు పాక్ సైనికులు మరణించారు. ఈ పేలుడు క్వెట్టాలో రోడ్డు పక్కన జరిగింది, ఇందులో పాక్ ఆర్మీ వాహనంలో ప్రయాణిస్తున్న సిబ్బంది హతమయ్యారు. ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించిందని ప్రకటించింది.

మరొకవైపు, బలూచ్ ప్రజల కోసం ఉద్యమిస్తున్న వారిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా హింస చేస్తూ, జైలులో వేయడం, పాక్ ఆర్మీ వారు ప్రజలను కిడ్నాప్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచ్ యాక్టివిస్ట్ కమిటీ (BYC) భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. తుర్బాట్, పంజ్‌గూర్, నొకుండి, దల్బందిన్, యక్మాచ్, చార్సర్, మష్ఖేల్, ఓర్మాగా, చాఘి, అమీనాబాద్, ఖరన్, కరాచీ, ఉతల్, గదాని, నుష్కి, కలాట్, మస్తుంగ్ వంటి నగరాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి.

ఇప్పుడు, క్వెట్టాలోని హుడా జైలులో బలూచ్ ఉద్యమకారులను పాక్ భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నట్లు సమాచారం వస్తోంది. అరెస్ట్ అయిన వారిలో మహరంగ్ బలోచ్, బెబార్గ్ బలోచ్, గుల్జాది బలోచ్ , బీబో బలోచ్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news