బెట్టింగ్ యాప్స్ వివాదం పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హైదరాబాద్ ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడమేంటి..? అని ప్రశ్నించారు. వీళ్ల ప్రమోషన్ చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు. వీళ్ల ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని.. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని మీరు సంపాదించుకున్న సంపాదనను కనీసం చారిటీల ద్వారా ఖర్చు చేయాల్సిందన్నారు.
మీకు ఎందుకు ఇంత కక్కుర్తి అని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసి ఇబ్బందుల్లో పడకండని యువతకు సూచించారు. వాస్తవానికి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై ఉచ్చుబిగుస్తోంది. చిన్న వాళ్ల నుంచి పెద్ద సెలబ్రెటీల వరకు అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల ఈ అంశం పై సజ్జనార్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్టు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా..? ఫాలో అవుతుంది అని తెలిపారు.