జమ్మూ కాశ్మీర్ లోని నౌషెరా సెక్టార్ లోని కేరీ ప్రాంతంలో మంగళవారం, బుధవారం మధ్య రాత్రి జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) నియంత్రణ రేఖ (ఎల్ఓసి) ప్రాణాలు కోల్పోయారు. కేరీ సెక్టార్లో ఫార్వర్డ్ ప్రదేశంలో ఈ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ఒక రక్షణ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ వద్ద కూడా పూర్తి సమాచారం లేదు. “మేము మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నాము” అని సదరు అధికారి తెలిపారు. ఆగస్టు 30 న, నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ కాల్పుల్లో మరో అధికారి ప్రాణాలు విచారు. గత శనివారం, సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ నుండి మొదలై జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్లోకి 150 మీటర్ల దూరం వరకు ఉన్న సొరంగం గుర్తించారు.