World Cup 2023 : వరల్డ్ కప్ మ్యాచ్ లో చంద్రబాబుకు ఘోర అవమానం !

-

వరల్డ్ కప్ మ్యాచ్లో నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 33 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా…. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ను ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి… అరెస్టు చేశారు. పక్క ఆధారాలు ఏసీబీ కోర్టు లో ప్రవేశపెట్టడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది.

అయితే మొన్న శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా అప్లై కార్డులు ప్రదర్శించారు క్రీడాభిమానులు. స్కాం స్టార్ బాబు అంటూ… చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులను హైదరాబాద్ స్టేడియంలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version