పాకిస్థాన్‌ కు బిగ్‌ షాక్‌… రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్

-

పాకిస్థాన్‌ క్రికెట్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. పాక్‌ సీనియర్‌ ఆల్‌ రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్‌ లో టీ 20 వరల్డ్‌ కప్‌ జరుగనుండగా… ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు హఫీజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాక్‌ తరఫున మహమ్మద్‌ హఫీజ్‌…. 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ 20 మ్యాచ్‌ లను ఆడి… మొత్తంగా 12, 258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌ లోనూ రాణించిన ఈ 39 ఏళ్ల క్రికెటర్‌… 246 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ లో 10 మ్యాచ్‌ లు ఆడిన మహ్మద్‌ హపీజ్‌ 217 పరుగులు చేశాడు. ఇందులో 98 పరుగుల రూపంలో శతక సమాన ఇన్నింగ్స్‌ కూడా ఒకటి ఉంది. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించినా.. పీఎస్‌ఎల్‌ లాంటి ప్రైవేట్‌ టీ 20 లీగ్స్‌ లో మాత్రం కొనసాగుతానని హఫీజ్‌ స్పష్టం చేశాడు. కాగా.. ఇప్పటికే రాస్‌ టేలర్, డేల్‌ స్టేయిన్‌, డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లు క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version