రివర్స్ పాలిటిక్స్: ‘కారు’కు నో రూల్స్..’బండి’కి బ్రేకులు..!

-

రాజకీయాల్లో రూల్స్ అందరికీ ఒకటే అని చెప్పడానికి లేదు. అధికార పార్టీ నేతలకొక రూల్…ప్రతిపక్ష నేతలకొక రూల్ అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఏదైనా ఒక పని అధికార పార్టీ నేత చేసే ఇబ్బంది ఉండదు..కానీ అదే పని ప్రతిపక్ష నేత చేస్తే ఇబ్బంది వస్తుంది. లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బంది అయిపోతుంది..వెంటనే పోలీసులు, ప్రతిపక్ష నాయకులని కంట్రోల్ చేసేస్తారు. ఇలా అనేక పర్యాయాలు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతూ వస్తుంది.

TRS-Party | టీఆర్ఎస్

అధికార టీఆర్ఎస్ నేతలకు రూల్స్ పెద్దగా వర్తించవు..కానీ ప్రతిపక్ష నేతలకు మాత్రం వర్తిస్తాయి. ప్రతిపక్ష నేతలు ఏవైనా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెడితే చాలు పోలీసులు ఆంక్షలు పెట్టేస్తారు. కానీ అధికార నేతలకు మాత్రం ఉండవు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్షను చేపట్టారు. ఇక ఈ దీక్షని పోలీసులు భగ్నం చేశారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు.

పైగా బండి సంజయ్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. సరే కోవిడ్ నిబంధనలు బండి సంజయ్‌కేనా…టీఆర్ఎస్ నేతలకు ఉండవా? అంటే ఉండవనే చెప్పాలి. కారు నేతలు మాత్రం ఎడాపెడా తిరిగేస్తారు. తాజాగా మంత్రి కేటీఆర్..నల్గొండ పర్యటనకు వెళ్లారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు కోవిడ్ రూల్స్ పాటించకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అలాగే సభలు, సమావేశాలు పెట్టారు. కానీ వారికి కోవిడ్ రూల్స్ వర్తించలేదు. పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తున్న బండిని రూల్స్ పేరిట అరెస్ట్ చేశారు. అయితే రూల్స్ పెడితే అందరికీ వర్తింపచేయాలి…కానీ తెలంగాణలో కారు నేతలకు రూల్స్ ఉండటం లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version