సరిహద్దుల్లో ఉద్రిక్తత.. నలుగురు జవాన్ల వీరమరణం..!

-

పాకిస్తాన్ సరిహద్దుల్లో రోజురోజుకు హద్దులు మీరి పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉన్న విషయం తెలిసిందే భారత్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంది పాకిస్తాన్. మరోసారి సరిహద్దుల్లో రెచ్చిపోయింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. ఇక జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో ఒకేసారి కాల్పులకు తెగ పడగా ఈ దాడిలో 4 గురూ జవాన్లు వీర మరణం పొందారు. ఇక అంతే కాకుండా ముగ్గురు పౌరులు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. పాకిస్తాన్ సైన్యం కి బుద్ధి చెప్పే పనిలో పడింది. ఇక ఆ తర్వాత భారత సైన్యం దాడి లో ఏకంగా 8మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అంతే కాకుండా మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయాలు అయ్యాయని భారత సైన్యం తెలిపింది. పాకిస్తాన్ సైన్యం దాడితో సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పోయాయి .

Read more RELATED
Recommended to you

Exit mobile version