పాకిస్థాన్ లో కృష్ణ మందిరం..! మందిరం పూజల్లో పాక్ ప్రభుత్వం..!

-

Pakistan government decided to construct a hindu temple in islamabad
Pakistan government decided to construct a hindu temple in islamabad

పాకిస్థాన్ లో హిందూ దేవాలయం..! అవును మీరు విన్నది నిజమే, పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి హిందువుల కోసం కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తుంది. పాకిస్థాన్ లో హిందువుల జనాభా పెరుగుతున్న దృష్ట్యా అక్కడ్డి ప్రభుత్వం హిందువుల కోసం ఓ కృష్ణ మందిరాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ దేవాలయానికి గాను అక్కడి ప్రభుత్వం 9.5 కోట్ల వ్యయాన్ని జారీ చేసింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో హెచ్‌-9 ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి స్థలంగా ఇచ్చారు. తాజాగా ఆ ప్రాంతంలో పునాది రాయి పడింది. మంగళవారం ఆ దేశ మానవ హక్కులపై పార్లమెంటరీ కార్యదర్శి లాల్‌చంద్‌ మాల్హీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. భూమి పూజా అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువులూ పాకిస్థాన్ బిడ్డలేనని వారి జనాభా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version