పాక్ లో రేపిస్ట్ ల కోసం కొత్త చట్టం.. దొరికారో ఇక ’అది’ ఉండదు !

-

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం రేపిస్టులకు విధించే శిక్ష గురించి ఒక కొత్త చట్టం చేసినట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెమికల్ కాస్ట్రేషన్ అంటే కొన్ని మందులు వాడి ఇక లైంగికంగా పనికి రాకుండా పోయేలా నిందితులను శిక్షించేలా ఈ చట్టం ఉందని అక్కడి మీడియా నివేదికలు చెబుతున్నాయి. అంటే కాక ఈ లైంగిక వేధింపుల కేసులను వేగంగా విచారించేలా ఏర్పడిన ఈ కొత్త చట్టాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అత్యాచారం నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను న్యాయ మంత్రిత్వ శాఖ సమర్పించిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది.

అయితే, దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. పోలీసింగ్, ఫాస్ట్ ట్రాకింగ్ రేప్ కేసులు మరియు సాక్షుల రక్షణలో మహిళల పాత్రను పెంచడం ఈ ముసాయిదాలో ముఖ్యమైన అజెండాగా ఉందని నివేదిక పేర్కొంది. ఇది చాలా తీవ్రమైన విషయం అని ఈ చట్టం విషయంలో ఆలస్యం ఉండదని అంటున్నారు. మా పౌరులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు. కఠినమైన ఈ చట్టం స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉంటుందని ప్రధాని చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version