ఉగ్రదాడిపై ప్రధాని మోడీ వార్నింగ్.. అభినందించిన పాక్ క్రికెటర్

-

జమ్ముకాశ్మీర్ ఉగ్రదాడిపై పాక్ ఉగ్రవాదులకు, అక్కడ వారికి మద్దతు తెలిపిన వారికి ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పాక్ మీద పలు ద్వైపాక్షిక పరంగా చర్యలు సైతం తీసుకున్నారు. అయితే, ప్రధాని మోడీ హెచ్చరికలపై పాక్ క్రికెటర్ స్పందించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నానని పాక్‌ మాజీ క్రికెటర్ దానిష్‌ కనేరియా సంచలన ప్రకటన చేశారు.మోడీ ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్‌ ప్రశంసలు కురిపించారు. గాజాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపునకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’వేదికగా దానిష్‌ కనేరియా ట్వీట్‌ చేశారు.కాగా, సీజ్ ఫైర్ ఎత్తేయడంతో బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్ గా ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news