చాలా శాతం మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. టీ ని కేవలం భారతదేశంలోనే కాకుండా ఇరాన్, అమెరికా వంటి ఇతర దేశాలలో కూడా కాఫీలను తాగుతారు. అంతేకాకుండా చాలా శాతం మంది భోజనం చేసిన తర్వాత కూడా టీ ని తాగుతూ ఉంటారు. అయితే, వీటి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కొంతమంది భావిస్తారు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు మరియు ఇంట్లో పని చేసేవారు రోజుకి కనీసం రెండు లేక మూడు సార్లు టీ తాగుతారు. పైగా ఇది ఒక అలవాటుగా మారుతుంది.
ఎప్పుడైతే టీ ని తాగుతారో, శరీరం ఎంతో యాక్టివ్గా పని చేస్తుంది అని భావిస్తారు. అంతేకాకుండా నీరసంగా ఉన్నప్పుడు, అలసటను తగ్గించడానికి కూడా టీ ఉపయోగపడుతుందని నమ్ముతారు. ఎప్పుడైతే ఉదయాన్నే టీ తాగుతారో, మెదడు చురుకుగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే భోజనం చేసిన తర్వాత టీ తాగడం వలన ఆరోగ్యం పై ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే భోజనం చేసిన వెంటనే టీ తాగుతారో, జీర్ణవ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. దీంతో పోషక పదార్థాలు పూర్తిగా శరీరం తీసుకోదు.
ఈ విధంగా జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ లో ఉండే కెఫిన్ మరియు ఇతర విలువలు జీర్ణ ప్రక్రియను తగ్గిస్తాయి. అంతేకాకుండా టీ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత టీ తాగుతారో, కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. దీంతో కడుపు నొప్పి రావడం, జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం జరుగుతాయి. కనుక, భోజనం చేసిన తర్వాత టీ తాగడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. టీ లో ఉండే గుణాలు రక్తపోటును పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే టీ తాగడం వలన నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి.