ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్న యువకుడు

-

ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే మరో ఘటన జరిగింది. జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు.. 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించారు.. ఇద్దరు అమ్మాయిలూ చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో… పెళ్లి పత్రికలు ముద్రించి వివాహం చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news