పల్నాడులో ఘోరరోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. వేల్పూరు-అచ్చంపేట రహదారిలో ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకోగా.. నేటి ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో క్రోసూరు మండలం దొడ్లేరు వాసి ఓర్సు వెంకటరాజు (18) మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు వేల్పూరులోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news