అమెరికా కొత్త అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురించి పాకిస్తాన్ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. చరిత్రలో కనివినీ ఎరుగుని రీతిలో అటు సెనెట్‌లోనూ (51) స్పష్టమైన మెజార్టీని సాధించింది.ఇక విక్టరీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయేది అమెరికా స్వర్ణయుగమన్నారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన ఓ ముస్లిం యువతి తన తండ్రి డొనాల్డ్ ట్రంప్.. అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు అని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ‘ట్రంప్ నా తండ్రి అని నొక్కిచెబుతూనే, ఈ అంశాన్ని ఎవరు అనుమానించాల్సిన అసవరం లేదు. నేను ఒక పంజాబీ ముస్లిం. నా సవతి తల్లి మెలానియా ట్రంప్ నన్ను సరిగా చూసుకోవడం లేదు. దీంతో నన్ను కన్న తల్లి చిన్నప్పుడే పాకిస్తాన్ తీసుకుని వచ్చేసింది’ అని ఓ అంతర్జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ యువతి ఉర్దూలో పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.