యుద్ధం మీద పాకిస్తాన్ యూటర్న్.. ఎందుకంటే?

-

యుద్ధం మీద పాకిస్తాన్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి భారత సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్స్,హైస్పీడ్ మిస్సైల్స్‌తో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ భద్రతా బలగాలు శనివారం తెల్లవారు జామున భారీ స్థాయిలో దాయాది దేశం మీద తీవ్రస్థాయిలో విరుచుక పడగా.. పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కేంద్రమైన రావల్పిండి లక్ష్యంగా భారత్ బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిసింది.

ఈ దాడుల్లో పాక్ వైమానిక దళానికి చెందిన కీలక ఎయిర్ బేస్‌లను భారత ఆర్మీ టార్గెట్ చేసుకున్నాయి. రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్‌బేస్, చక్వాల్ సమీపంలోని మురిద్కే ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులకు పాల్పడగా.. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గించుకుందామని పాక్ సంకేతాలు పంపుతున్నట్లు తెలిసింది. మరోవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి, సొంత దేశంలో పౌరుల నుంచి వ్యతిరేకత, భారత్‌కు ప్రపంచ దేశాల మద్దుతు కారణంగా పాక్ యుద్ధంపై యూటర్న్ తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news