పలాస 1978 ట్విట్టర్ రివ్యూ..!

-

ఈ మధ్య ప్రేక్షకులు భిన్న కథలను ఇష్టపడుతున్నారు. కథలో పట్టు ఉంటేనే సినిమాను ఇష్టపడుతున్నారు. లేకపోతే అది ఎంత స్టార్ హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. దీనితో కొత్త దర్శకులు మంచి సినిమాల కోసం ప్రయత్నం చేస్తూ కథలను కూడా ఆకర్షనియంగా ఉండే విధంగా, భిన్నంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పలాస 1978 సినిమా కూడా అలాంటిదే.

ఈ సినిమాను కాస్త కొత్తగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కి౦చారు. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా చూపించారట. ఈ సినిమా విదేశాల్లో ఇప్పటికే విడుదల అయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్తున్నారు. 1970-80ల కాలంలో నాటి పరిస్థితులు, అక్కడి సామాజిక సమస్యలను చూపుతూ సాగుతుంది. పలాస చిత్రంలో ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉందట.

కనిపించినంత సేపు ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకుడిపై ప్రభావాన్ని చూపేలా ఉంటుంది. సామాజిక సమస్యలు, అగ్ర కులాలు, నిమ్న కులాలు, వర్గ పోరాటం, ఇలాంటి కాన్సెప్ట్‌ల ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. కాని ఈ సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడని అంటున్నారు. ముఖ్యంగా రెండో భాగంలో ఉండే కొన్ని సీన్లు ప్రేక్షకులను మెప్పించాయని అంటున్నారు. ప్రధాన పాత్రలు అన్నీ కూడా నటన ఆకట్టుకున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version