కేంద్రం వారంలో బియ్యం కొనాలే.. లేకుంటే అంతే: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

-

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌ నడుస్తోంది. కేంద్రం ప్రభుత్వం వారంలోగా ధాన్యం కొనుగోలు చేయాలంటూ డెడ్‌లైన్‌ విధించారు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతల ఇండ్లు, కార్యాలయాలను ముట్టడించి, వారిని గ్రామాల నుంచి తరిమి కొడతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ బిడ్డలే అయితే ఇకనైనా రాష్ట్ర రైతాంగానికి అండగా ఉండాలని హితవు చెప్పారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. మోదీని ఒప్పించి వడ్లు కొనుగోలు చేయిస్తామని, వరి వేయాలని రైతులను పక్కదారి పట్టించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇప్పుడు ఎక్కడకుపోయారని నిలదీశారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకొన్న బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోదీ, పీయూష్‌గోయల్‌ మొదటి నుంచి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని, మొన్నటిదాకా వడ్లు కొనేది లేదన్న గోయల్‌ ఇటీవల నిర్వహించిన వ్యవసాయ సదస్సులో వరివేయాలని,
బియ్యం ఎగుమతికి సహకరించాలని కోరారని గుర్తుచేశారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. దేశ సంపదను అదానీకి కట్టబెట్టడమే విధానంగా పెట్టుకొన్న మోదీ దేశాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నారని దుయ్యబట్టారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోయినా రైతులనుఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు పెట్టి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వివరించారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version