నేను కేసీఆర్ ను కలవలేదు..ఇది బీజేపీ కుట్ర – పాల్వాయి స్రవంతి

-

నేను కేసీఆర్ ను కలవలేదు..ఇది బీజేపీ కుట్ర అని మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ను మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే..దీనిపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు.

ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారి పైన ఈసీకి పిర్యాదు చేస్తాను..బీజేపీ నేతల కుట్రనే ఇది..కాంగ్రెస్ శ్రేణులు..మునుగోడు ప్రజలు పూర్తిగా గమనించాలి. అమ్ముడు పోయే వారే. ఈ ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలో సామాన్యుల పైనా కూడా దాడులు చేస్తున్నాయి..ఒక్క ఆడపిల్లను ఎదుర్కొనే లేక ఈ ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళను గుర్తించాలని పేర్కొన్నారు పాల్వాయి స్రవంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version