ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త..భారీగా రుణాలు !

-

ఏపీలోని డ్వాక్రా మహిళ కోసం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులో ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయొద్దు అంటుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో, సెర్ప్ సీఈవో మహ్మద్ ఇంతియాజ్ లేఖలు రాశారు.

cm jagan

ముంబైలోని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ లోని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్ తో పాటు ఎస్ఎల్బీసీ కన్వీనర్లకు లేఖలు పంపారు. ప్రాసెసింగ్ చార్జీలు వసూలుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆర్బిఐ ను కోరింది.

ప్రస్తుతం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణం మొత్తం పై 0.5% నుంచి 1.2% దాకా రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలు రూ.10 లక్షలు బ్యాంకు రుణం తీసుకుంటే, దాదాపు రూ.10వేల వరకు ప్రాసెసింగ్ ఫీజుగా బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version