ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియ హవా నడుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలు ముఖ్యంగా టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా చేస్తోంది. బాహుబలి1,2 ఇచ్చిన జోష్ తో మన నిర్మాలు, డైరెక్టర్లు, హీరోలు ఇలా అంతా ప్యాన్ ఇండియా జపం చేస్తున్నారు. తమ సినిమాలు అన్ని భాషల్లో విడుదలయ్యేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే బాహుబలి ప్యాన్ ఇండియాగా వచ్చి సక్సెస్ కొట్టడంతో అన్ని సినిమాలు పెద్ద హిట్లు కావాలనే రూలేం లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన ‘ సాహో’ ప్రస్తుతం ‘ రాధేశ్యాం ’ పరిస్థితులు చూస్తే మనకు అర్థం అవుతోంది. ఎంతగా బాలీవుడ్ యాక్టర్లు, భారీ తారాగణాన్ని తీసుకున్నా.. సినమాలో కంటెంట్ లేకపోతే సినిమాను ప్రేక్షకులు ఆదరించడం లేదు. సాహో సినిమాలో శ్రద్దా కపూర్, నీల్ నితిన్, మందిర బేడి, జాకీ ష్రాఫ్ ఇలా పేరున్న యాక్టర్లను తీసుకువచ్చిన.. సినిమా బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా బాలీవుడ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా ‘ పుష్ప’ ఈ సినిమాలో కంటెంట్, నటుల ఫెర్ఫామెన్స్ చూసి బాలీవుడ్ షాక్ అయింది. ఇందులో పుష్ప, మంగళం శీను, జాలిరెడ్డి వంటి పాత్రలు పేర్లతోనే ఫేమస్ అయ్యాయి. ఇక్కడ నటులు ఎవరనేది పట్టించుకోలేదు. చివరకు ఈపేర్లతో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు నార్త్ పీపుల్. ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటి అంటే… బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే బాలీవుడ్ నటులు ఉండాలనే రూలేం లేదు.. కథలో దమ్ము, కంటెంట్ పరంగా, నటుల ఫెర్పామెన్స్ సూపర్ గా ఉంటే ఆటోమెటిక్ గా సినిమా హిట్ అవుతుంది.