RC16 మూవీకి ప్యాన్ ఇండియా విలన్..!

-

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. నిన్న RC16 పూజా కార్యక్రమం జరిగింది.ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ఇప్పుడు ఆర్టిస్ట్ ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇక ఇందులో భాగంగా ఈ సినిమా లో నటించే విలాన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సంజయ్ దత్తును చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని, ఎగ్రిమెంట్ అయ్యాకనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం .ఇప్పటికే సంజయ్ దత్..’కేజీయఫ్‌ 2′, ‘లియో’లో విలన్‌గా కనిపించారు. ఆయా చిత్రాలతో ఆయన తెలుగువారికీ చేరువయ్యారు.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version