ధనాధన్ తో ధోని వీడ్కోలు పలకాలని కోరుకుంటున్న అభిమానులు

-

అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తప్పకుండా మహేంద్రసింగ్ ధోని తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గానూ అదే విధంగా వైదొలిగారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ ఈ సీజన్లో ధోని మునపటి మెరుపులు చూపించాలని కోరుకుంటున్నారు. కెప్టెన్సీ భారం లేనందున టాప్ ఆర్డర్లో దిగి దూకుడుగా ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. రెప్పపాటు కాలంలో చేసే స్టంపింగ్స్, హెలికాప్టర్ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఘనంగా ఐపీఎల్కు వీడ్కోలు పలకాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చెన్నైకి 5 ట్రోఫీలను అందించిన విజయాలకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.

కాగా, ఐపీఎల్ చరిత్రలో గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకరైన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు ట్రోఫీలు అందించారు. కెప్టెన్గా 13 సీజన్లు వ్యవహరించిన ధోని 10 సార్లు ఆ జట్టును ఫైనలు చేర్చారు. ఇక కెప్టెన్ గా 226 మ్యాచుల్లో 133 విజయాలు, 91 ఓటములు ధోనీ ఖాతాలో ఉన్నాయి.కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన చివరి మ్యాచులో ఐపీఎల్-2023 విజేతగా చెన్నై జట్టును నిలపడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version