పారాలింపిక్స్ హీరోలు.. ఈ రాష్ట్రం నుంచే అత్యధిక మెడల్స్!

-

పారిస్‌‌లో జరిగిన పారాలింపిక్స్‌‌లో భారత్ గెలిచిన మొత్తం 29 పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పతకాలను దేశంలోని 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్లేయర్లే సాధించడం గమనార్హం. అత్యధికంగా హరియాణా నుంచి 8 మంది, తమిళనాడు నుంచి నలుగురు పతకాలు అందుకున్నారు. యూపీ, రాజస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ , బిహార్, ఢిల్లీ, నాగాలండ్, కర్ణాటక నుంచి ఒక్కరు చొప్పున మెడల్స్ సాధించారు.

ఇదిలాఉండగా, పారాలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన విజేతలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అపూర్వ స్వాగతం లభిస్తుందని అంతా భావించారు. కానీ, అథ్లెట్ల కుటుంబీకులు, జర్నలిస్టులు, పలువురు మినహా ఎవరూ విష్ చేయడానికి రాకపోవడంతో అథ్లెట్లు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఇతర క్రీడల పట్ల లేకపోవడం అథ్లెట్లను తీవ్ర నిరాశకు గురిచేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పారా అథ్లెట్లకు లభించిన స్వాగతంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version