అమరావతిలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి మరోసారి టెండర్లు!

-

ఏపీలో రాజధాని అభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు మరోసారి ఏపీకి రాజధానిగా అమరావతినే ఎంచుకోవడం, గతంలో చేపట్టిన నిర్మాణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు రాజధాని ప్రాంతంలో చేపట్టబోయే నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అయితే, రాజధానికి ఆమడ దూరంలో 1200 నివాస యోగ్యమైన ప్లాట్ల నిర్మాణానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

చంద్రబాబు ఇప్పటికే హ్యాపీనెస్ట్‌కు ఆమోదం తెలపడంతో టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. రూ.930కోట్ల అంచనా వ్యయంతో రాజధాని అమరావతిలో గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం 12 టవర్లలో జీ+18 ఫార్మాట్‌లో 1200 ప్లాట్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2018లోనే అమ్మకాలు పూర్తయినా వైసీసీ హయాంలో పనులు ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి టెండర్లు పిలిచేందుకు ప్రస్తుత సర్కార్ సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version