కరోనా లాక్‌డౌన్ సమయంలో తమ కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు చేపట్టిందని ఆ కంపెనీ తెలిపింది. గత 80 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును ప్రస్తుతం బ్రేక్ చేశామని పార్లె-జి వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో తమ అమ్మకాలు 80 నుంచి 90 శాతం పెరిగాయని, దీంతో మార్కెట్‌లో తమ వాటా 5 శాతం పెరిగిందని తెలిపింది. ఈ మేరకు పార్లె-జి ప్రొడక్ట్స్ హెడ్ మయాంక్ షా ఓ ప్రముఖ పత్రికతో ఈ వివరాలను పంచుకున్నారు.
అయితే పార్లె-జి తమ అమ్మకాలకు సంబంధించి నిర్దిష్టమైన సంఖ్యలను మాత్రం వెల్లడించలేదు. ఏయే ప్రొడక్ట్స్ ఎంత సంఖ్యలో అమ్ముడైంది తెలియజేయలేదు. కానీ ఆ కంపెనీకి చెందిన రూ.5 బిస్కెట్ పాకెట్ అధికంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలు పెద్ద ఎత్తున ఆ బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశారట. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పేదలకు పంచాయి. ఇక ఇండ్లలోనూ చాలా మంది ఆ బిస్కెట్లను ఎక్కువ సంఖ్యలో కొన్నారు. అందువల్లే సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది.
కాగా పార్లె-జి బిస్కెట్లు హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ రూ.77కి అమ్ముడవుతున్నాయి. అందువల్లే చాలా మంది ఈ బిస్కెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.