బాలయ్య బోయపాటిల హ్యాట్రిక్ సినిమా ” BB3 ” ఫస్ట్ రోర్ అదిరిందిగా …!

-

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షూటింగ్ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇంతకముందు సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో అటు బాలయ్య ఇటు బోయపాటి ఉన్నారు.

 

ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి టిటిల్ ఏది నిర్ణయిస్తారన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. దాంతో బాలయ్య అభిమానులు రక రకాల టైటిల్ ని ప్రచారం చేశారు. అంతేకాదు గత పది రోజులుగా బాలయ్య సినిమాకి మోనార్క్ అన్న టైటిల్ అని అనుకుంటున్నారన్న ప్రచారం బాగా వేడెక్కించింది. కాని అవన్ని కాదని బాలయ్య 106 సినిమా BB3 ఫస్ట్ రోర్ ని రిలీజ్ చేశారు బోయపాటి బృందం. ఈ ఫస్ట్ రోర్ కి ప్రేక్షకుల నుండి నందమూరి అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

బాలయ్య బర్త్ డే సందర్భంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య BB3 ఫస్ట్ రోర్ రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ని తిరిగి త్వరలో ప్రారంభించబోతున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాని మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

 

ఇక ఈ రోజే నందమూరి బాలకృష్ణ ఒక పాటని పాడి ఆ పాట టీజర్ ని రిలీజ్ చేయడం విశేషం. మొదటి సారి పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పైసా వసూల్ సినిమాలో “మావా ఎక్ పెగ్ లా” అని ప్రేక్షకులను ఉర్రూతలెక్కించిన బాలయ్య ఈ సారి తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన “జగదేక వీరుని కథ” సినిమా లోని” శివ శంకరి… శివానంద లహరి” అన్న పాటను బాలయ్య పాడటం గొప్ప విషయం. ఈ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version