ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

-

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు దఫాలుగా జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు సాగనున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం తర్వాత రెండో దఫా సమావేశాలు ప్రారభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ట్విటర్​ వేదికగా ప్రహ్లాద్​ జోషి వెల్లడించారు.. మొత్తం 66 రోజుల పాటు సాగి.. ఏప్రిల్​ 6న సమావేశాలు ముగియనున్నట్లు తెలిపారు.

తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం కేంద్ర బడ్జెట్​ మీద చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రధాని.. రాష్ట్రపతి ప్రారంభోపన్యాసానికి కృతజ్ఞత ఉపన్యాసం ఇస్తారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి సమాధానాలు ఇస్తారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version