పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఆగస్టు 12వ తేదీ వరకు 17 రోజుల పాటు ఈ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో మొత్తం 32 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. “తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ” బిల్లును కూడా ఈ సమావేశాల్లో లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తం బిల్లులో 24 కొత్త బిల్లు ఉండగా 5 పాత బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా కాలంచెల్లినవి అని పేర్కొంటూ 71 చట్టాలను తొలగించనున్నారు.
కాగా వరద సమస్యలు, ధరల పెరుగుదల, అగ్నిపధ్ సహా అనేక సమస్యలను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. కొత్తగా ఎన్నికైన నలుగురు ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తెలంగాణలో వరద పరిస్థితుల పై లోక్ సభలో అత్యవసరంగా చర్చించాలని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.