టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య-సమంతల డైవోర్స్ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి చాన్నాళ్లు అయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. విడాకులు తీసుకోకుండా ఉండాల్సిందని ఇప్పటికీ కొందరు ప్రముఖులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, వారు మాత్రం ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇకపోతే నాగచైతన్య తల్లి లక్ష్మీ నాగార్జునతో చాన్నాళ్ల కిందట డైవోర్స్ తీసుకున్నది. ఆ తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకోగా, లక్ష్మీ వేరే వాళ్లను పెళ్లి చేసుకుంది. అయితే, లక్ష్మీ దగ్గుబాటి డైవోర్స్ తీసుకోవడానికి గల కారణం చాలా మందికి తెలియదు. ఈ సందర్భంలో నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ..నాగార్జునతో డైవోర్స్ తీసుకోవడానికి గల కారణమేందో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ప్రొడ్యూసర్ డి.రామానాయుడు..ఈయన ఏఎన్ఆర్ తో చక్కటి సినిమాలు తీశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అలా వీరు వియ్యంకులు కావాలని అనుకున్నారు. ఇక అప్పటికే నాగార్జున హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా రామానాయుడు కూతురు లక్ష్మీని నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి వరకు లక్ష్మీ అగ్రరాజ్యం అమెరికాలో ఉంది.
ఇండియాకు ఆమెను రప్పించి మ్యారేజ్ చేశారు. అలా వీరికి నాగచైతన్య జన్మించాడు. మ్యారేజ్ తర్వాత నాగార్జునతో కలిసి ఇండియాలోనే ఉండాలని నాగార్జున అన్నారట. అయితే, అందుకు ఒప్పుకోని లక్ష్మీ దగ్గుబాటి అమెరికాకు వెళ్దామని అందట. అలా వీరిద్దరి మధ్య గొడవలు జరిగి డైవోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అమలను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే.