గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో డబ్బు పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది. ఈ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు అభ్యర్థుల కొత్త ఎత్తులు వేస్తున్నారు. గూగుల్ పే, పే టీమ్ లతో పాటు ఏకంగా అకౌంట్ కే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి పార్టీలు. జగద్గిరి గుట్ట డివిజన్ లో ఓటర్ అకౌంట్ కు 5 వేల అమౌంట్ డిపాజిట్ చేసినట్టు సమాచారం.
తనకు 5 వేలు అకౌంట్ లో పడడం ఫై అవాక్కయిన ఓ ఓటర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అయ్యారు. అయితే మేమే వేశామంటూ ఓటరు కు ఫోన్ చేసి బూత్ కమిటీ ఇంచార్జ్ చెప్పినట్టు సమాచారం. ఓటర్ స్లిప్ చూసి పార్టీలు అకౌంట్స్ కి డబ్బులు వేస్తున్నట్టు చెబుతున్నారు. డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తుండడం ఇతర పార్టీల వారితో గొడవలు అవుతూ ఉండడంతో అభ్యర్థులు రూట్ మార్చినట్టు చెబుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని ఊరికే అన్నారా మరి.