ఏపీలో పాస్టర్ ప్రవీణ్ మరణించి మూడురోజులు గడిచినా ఆయన మరణంపై మిస్టరీ నేటికీ వీడలేదు. ప్రభుత్వం మాత్రం పాస్టర్‌ది రోడ్డు ప్రమాదమే అని చెబుతుండగా.. క్రైస్తవ సంఘాలు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. మరోవైపు పోలీసు శాఖ మాత్రం ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలపడానికి తమకు ఆధారాలు లభించాయని.. సీసీ టీవీ ఫుటేజీలను విడుదల చేస్తున్నాయి.
తాజాగా పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వలన జరగలేదని.. ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని.. ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాస్టర్ ప్రవీణ్ పగడాలను విజయవాడలోనే చంపేశారు. పోలీసులకు నేను సవాల్ చేస్తున్నా. నేను హెల్మెట్ పెట్టుకుని అదే స్పీడ్‌లో ప్రవీణ్ పడిన చోటే పడతాను.నాకు దెబ్బలు తగిలినా సరే,ప్రాణం పోయినా సరే’ అని హర్షకుమార్ సవాల్ విసిరారు.