పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తి.. రాజమండ్రి ఆసుపత్రికి కే.ఏ.పాల్..!

-

పాస్టర్ ప్రవీణ్  మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసింది. ఆ తరువాత ప్రవీణ్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. దీంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్ బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ప్రభుత్వాసుపత్రి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు కొందరూ క్రైస్తవులు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కే.ఏ.పాల్.. పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ వద్దకు వెళ్లారు. 

పోస్టుమార్టం జరుగుతుండగా.. ఆ ప్రక్రియను తాను పరిశీలిస్తానన్నారు. పోస్టుమార్టం గదిలోకి పాల్ కు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కే.ఏ.పాల్ రాకతో భారీగా నినాదాలు చేశారు క్రైస్తవులు. విచారణలో స్పష్టత రాకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి కే.ఏ.పాల్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి ఈ విషయం మీద చాలా సార్లు స్పందించాను. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు మెసేజ్ లు చేసాను.. కానీ రెస్పాన్స్ రాలేదన్నారు పాల్. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version