శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎదగడం గర్వకారణం : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

-

ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2025 సంవత్సరానికి 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితా విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోడీ అగ్రస్థానం దక్కించుకోగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తొమ్మదో స్థానాన్ని దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండగా.. రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు.

గత ఏడాదితో పోల్చితే.. రేవంత్ రెడ్డి 11 స్థానాలు ఎగబాకి పైకి చేరుకున్నారు. దీంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణం అన్నారు. దేశంలో ప్రతిపక్షనేత గా ఎన్నో కష్టాలను ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ.. 9వ ర్యాంకు సాధించిన రాహుల్ గాంధీకి, సంవత్సరం క్రితమే సీఎం శక్తిమంతమైన నేతగా ఎదిగికి కాంగ్రెస్ పార్టీకి పేరు తెస్తున్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version