పతంజలి కేసు…. కేంద్రంపై మండిపడ్డ దేశ అత్యున్నత న్యాయస్థానం

-

ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు మండిపడింది. కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందని విమర్శించింది. ‘ఇది చాలా దురదృష్టకరం. కేంద్రం వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లతో దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. సంస్థ తమ ఔషధాలకు సంబంధించిన యాడ్స్ తక్షణమే నిలిపివేయాలి’ అని ఆదేశాలు జారీ చేసింది.

ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతికూల ప్రకటనలు చేయకుండా కంపెనీని నిలుపుదల చేస్తూ నవంబర్ 2023 నాటి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు పతంజలి కంపెనీ మరియు దాని డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా,హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కీళ్లనొప్పులు, ఉబ్బసం,రక్తపోటు, మధుమేహం, ఊబకాయాన్ని మీ మందులు పూర్తిగా నయం చేస్తాయని పతంజలి ఎలా చెప్పగలదంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news