కరోనా కాలంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్లు..పరిష్కారం ఇలా చేసేద్దాం.!

-

కరోనా కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తపడటం ఒక ఎత్తు అయితే..వచ్చినప్పుడు తగిన చికిత్స తీసుకోవడం మరో ఎత్తు. ఎలాగోలా బయటపడ్డాం అంటే కరోనా కారణంగా..శరీరంలో రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఘుగర్‌ బారిన పడ్డారు. మనిషిలో చురుకుదనం తగ్గి అనేక వ్యాధులు గురవుతున్నారు. యూరిక్‌ యాసిడ్ కూడా కరోనా తర్వాత పేషెంట్లలో కనిపిస్తోంది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం.. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలో కీళ్ల నొప్పులు, వాపులు, తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. అయితే ఈ వ్యాధిని కొన్ని హోం రెమిడిస్‌తో తగ్గించుకోవచ్చు. అవేంటో ఎలా చేయాలో చూద్దాం.

అవిసె గింజలు యూరిక్ యాసిడ్ సమస్యను వదిలించుకోవడంలో చాలాబాగా పనిచేస్తాయి. అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తినాలి. దీంతో యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది.

విటమిన్ ఈ ఆలివ్ ఆయిల్‌లో సమృద్ధిగా ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఎక్కువ నీటితో హానికరమైన పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళుతాయి. తద్వారా మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఎక్కువ నీరు ఎక్కువగా తాగడం ఇప్పుడే అలవాటు చేసుకోండి.

ప్యూరిన్-రిచ్ ఫుడ్స్ జీర్ణక్రియ ప్రక్రియలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. అందుకే బఠానీలు, బచ్చలికూర, పుట్టగొడుగులు, ఎండిన బీన్స్, పంది మాంసం, చికెన్, చేపలు, మటన్, కాలీఫ్లవర్, కిడ్నీ బీన్స్, బీర్‌లను పరిమితికి మించి తినకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.

బెర్రీస్ : స్ట్రాబెర్రీలతో పాటు బ్లూ బెర్రీస్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోస్‌ని నియంత్రణలో ఉంచుతాయి.

ఆపిల్: రోజూ భోజనం తర్వాత ఒక ఆపిల్ తినాలి. ఇందులో ఉండే మాలిక్ ఆమ్లం యూరిక్ యాసిడ్‌ను న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

విటమిన్ సీ ఉండే ఐటమ్స్‌ : ఈ పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మీరు రోజుతినే ఆహారంలో విటమిన్ సీ సమృద్ధిగా ఉండేవాటిని తీసుకోవాలి. జామ, నిమ్మ, కివీ, ఆరెంజ్, క్యాప్సికం, టమాట, ఆకుకూరలు తీసుకోవాలి.

గ్రీన్ టీ : గ్రీన్ టీ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చక్కెరతో తయారుచేసినటువంటి జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం తగ్గించండి. సమద్ర చేపలు అయిన సాల్మొన్, హెర్రింగ్, మాకెరిల్, సార్డినెస్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఈ సమస్య తీవ్రత ఎక్కువగా లేకుంటే ఈ టిప్స్‌తో అదుపులో ఉంచుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాటమే ఉత్తమం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version