ఈ కోతికున్న దేశభక్తిని చూస్తే ఆశ్చర్యపోవాలంతే..!

-

సాధారణంగా మనుషులు వారు నివసించే దేశం పట్ల భక్తిని కలిగి ఉంటారు. కానీ, మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో మంకీ కూడా దేశభక్తి కలిగి ఉంది. అవునండీ.. మీరు చదివింది నిజమే. ఈ కోతి దేశం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది కూడా. అందుకుగాను జాతీయ జెండాను ఆవిష్కరిస్తుంది. ఈ ఘటన మనదేశంలోనే జరిగింది. వివరాల్లోకెళితే.. సాధారణంగా కోతులు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుండటం మనం చూడొచ్చు. ఒకవేళ మనుషులు ఎవరైనా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తే ‘కోతి చేష్టలు’ మానుకో అని మనం హెచ్చరిస్తుంటాం. అయితే, ఈ కోతుల చేష్టలకు సంబంధించిన బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు.

అవి చూసి నెటిజన్లు ఫుల్ హ్యాపీగా ఫీలయి ఎంజాయ్ చేసే ఉంటారు. కాగా, తాజాగా ఓ కోతి దేశభక్తిని కనబరిచే పని చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో సదు మంకీ ఓ బిల్డింగ్‌పైకి ఎక్కి ఉంది. అక్కడ ఉన్న భారత జాతీయ జెండాను ఆవిష్కరించింది. ఆ జెండాలో ఉన్న పూల వానను కింద‌కు కురిపిస్తూ మువ్వన్నెల జెండా ఎంతో స్వేచ్ఛగా రెపరెపలాడుతుండటం మనం చూడొచ్చు. అయితే, దానిని ఆవిష్కరించింది కోతి కావడం విశేషం. ఇక ఫ్లాగ్ హోస్టింగ్ సందర్భంగా బిల్డింగ్ ప‌రిస‌రాల్లో ఉన్న వారంతా చప్పట్లు కొట్టడం మనం చూడొచ్చు. ఒక కోతి జెండా ఆవిష్కరిస్తుండగా మరో కోతి దానిని చూస్తూ ఉంది. దీన్నంతా వీడియో తీసి గిడ్డా కంపెనీ అనే యూజర్ త‌న ఇన్ స్టా గ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేయ‌గా అది ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. వీడియో చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కోతి మంచి పని చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోని ఓ స్కూల్ బిల్డింగ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version