పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే అప్పటినుండి కూడా రాష్ట్రం మొత్తం పిఠాపురం పైపే చూస్తోంది. పవన్ తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారని రేపుతున్నాయి బ్లేడ్ బ్యాచులు దాడులకి సిద్ధమయ్యాయి అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడానికి చూస్తుంటే అవి నిజమేనా అని ఆందోళన జనసైనికులు అలానే కూటమి నేతల్లో మొదలైంది.
ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం పై వైసీపీ ప్రత్యేక ఫోకస్ ని పెట్టింది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో పవన్ ని అడ్డుకునేందుకు మొదటగా అదే సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం రంగంలోకి దింపారు. ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో వైసీపీ నుండి పోటీ చేస్తున్న కాకినాడ ఎంపీ వంగా గీత కూడా పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిఠాపురంలో జనసేన బలం ఎక్కువగా ఉంది మైండ్ గేమ్ తో మొదట జనసేన ని బయట పెట్టాలని చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.