బిజెపితో పొత్తు పెట్టుకుని రెండు వారాలు కూడా కాక ముందే జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతగా ఉన్న జెడి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ కి ఆయన కోలుకోలేని దెబ్బ కొట్టారు. పవన్ సినిమాల్లో నటించడం ఇష్టం లేక తాను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని, పవన్ విధివిధానాలు తనకు నచ్చలేదు అని ఆయన లేఖ రాసారు.
ఆ లేఖలో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. దీనితో ఒక్కసారిగా జనసేన సైనికులు షాక్ అయ్యారు. ఈ ఊహించని పరిణామం తో పవన్ కూడా ఒకింత షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉంటే లక్ష్మీ నారాయణ లేఖపై పవన్ స్పందిస్తూ మరో లేఖ విడుదల చేసారు. “లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము. శ్రీ వి.వి.లక్ష్మీ నారాయణ గారు భావాలను గౌరవిస్తున్నాము ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు పవర్ ప్రాజెక్టులు గనులు పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు.
అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం నా కుటుంబం కోసం పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పని సరి ఇవన్నీ లక్ష్మీ నారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు జన సైనికులకు ఆయన పై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆయనకు శుభాభినందనలు.” అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.