2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి ముఖ్యపాత్ర పోషించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు యొక్క రిజల్ట్ బాగా కనపడింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా మరియు జనసేన పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయడంతో ఉభయగోదావరి జిల్లాల్లో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు బెనిఫిట్ పొందింది వైసిపి పార్టీ. ముందు నుండి జగన్ తన పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అంటూ బలమైన వాదన ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది.
ముఖ్యంగా జనసేన పార్టీ కాస్తోకూస్తో ప్రభావం చూపించే గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి భారీ నష్టం జరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో రాజకీయాలలో అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీతో చేతులు కలిపి జగన్ కు మేలు చేస్తూనే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, టోటల్‌గా జగన్‌కు లబ్ది చేకూరడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది జగన్ పార్టీ అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.
.