“ఉస్తాద్ భగత్ సింగ్” గా పవన్ కళ్యాణ్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ” భవదీయుడు భవత్ సింగ్ ” సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి.

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. అయితే కొన్నాళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్ పై నమ్మకంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఇది కూడా తమిళ్ హీరో విజయ్ తేరి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ చేశారు. అయితే తాజాగా ఆదివారం ఉదయం ఈ వార్తలన్నిటికీ సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ తో తాను “ఉస్తాద్ భగత్ సింగ్” గా మారుస్తున్నట్లు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్ ను విడుదల చేశారు హరీష్ శంకర్.

“మనల్ని ఎవడ్రా ఆపేది ” అనే ట్యాగ్ లైన్ ని కూడా తగిలించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా.. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఇది కూడా తేరి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version